తెలంగాణ

telangana

ETV Bharat / city

కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమం.. వెంటనే విడుదల చేయాలి: తెదేపా - achennaidu on kollu ravindra arrest

ఏపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టుపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను వెంటనే విడుదల తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయని దుయ్యబట్టారు.

కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమం.. వెంటనే విడుదల చేయాలి: తెదేపా
కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమం.. వెంటనే విడుదల చేయాలి: తెదేపా

By

Published : Mar 11, 2021, 11:03 AM IST

ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా అక్రమాలను అడ్డుకున్న బీసీలను కేసులతో వేధిస్తారా అని నిలదీశారు. సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు.

"బీసీలను పండగ రోజు కూడా సంతోషంగా ఉండనీయట్లేదు. దొంగ ఓట్లు వేసుకున్న వైకాపా నేతలపై ఏం చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయి-" చంద్రబాబు

అరెస్టులు ఆందోళనకరం: అచ్చెన్నాయుడు

కొల్లు రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష సాధింపులకు నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అక్రమాలను అడ్డుకున్నందుకే కొల్లును అరెస్టు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయని అచ్చెన్నాయడు విచారం వ్యక్తం చేశారు.

మరింత పోరాడతాం: లోకేశ్

కొల్లు రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చెప్పారు. అరెస్టులతో బెదిరించాలని చూస్తే మరింత పోరాడతామని హెచ్చరించారు. ఎంత అణిచినా ఉప్పెనలా తెదేపా సైన్యం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details