తెలంగాణ

telangana

ETV Bharat / city

సినిమా స్టైల్​లో చేజింగ్, గొలుసు దొంగను చితకబాదిన స్థానికులు - villagers attack on thief

Chain snatcher caught పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ఓ దొంగ కన్నేశాడు. ఆమెతో మాటలు కలిపి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. సినిమా స్టైల్​లో చేజింగ్​ జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

గొలుసు దొంగను చితకబాదిన స్థానికులు
గొలుసు దొంగను చితకబాదిన స్థానికులు

By

Published : Aug 18, 2022, 10:28 PM IST

Chain snatcher caught పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఓ దొంగను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. జిల్లాలోని కదిరి మండలం మల్లయ్య గారిపల్లి గ్రామంలోని ఓ పొలంలో ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మమ్మ అనే వృద్ధురాలు మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తాడు.

వృద్ధురాలు కేకలు వేయడంతో వెనుక వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వెళ్లి అతడిని అడ్డుకుని.. దొంగను పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆ ఊరి గ్రామస్థులు దొంగను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. బంగారు గొలుసు లాక్కెళ్లిన వ్యక్తి కదిరి పట్టణానికి చెందిన శివ కుమార్​గా గుర్తించిన స్థానికులు.. అక్కడి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపహరణకు గురైన గొలుసుతో పాటు దొంగను పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details