జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద కలలుగన్న సమాజం ఆవిష్కరణే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. వివేకానందుడు చూపిన బాటలో యువతరం నడవాలని సూచించారు. 19 నెలలుగా ఏపీ రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అప్పుల ఊబిలో ముంచారని ఆరోపించారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారనీ.. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
'అంధకారంలో ఉన్న ఏపీకి వెలుగు చూపాల్సింది యువతే'
తెదేపా అధినేత చంద్రబాబు... యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని సూచించారు. వివేకానందుడు చూపిన బాటలో నడవాలని సూచించారు.
యువతకు చంద్రబాబు యువజన దినోత్సవ శుభాకాంక్షలు
వేలమంది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీ రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని.. పాలకుల దుశ్చర్యలపై అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచించారు.
- ఇదీ చదవండి :'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'