భూ వివాద కేసుల పరిష్కారానికి మరింత గడవు పెంచాలని ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 10వరకే గడువు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది రెవెన్యూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆగమేఘాల మీద తీర్పులు వెలువరించడం వల్ల కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు.
"తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 10 వరకు గడవు విధించారు. ఆ సమయం సరిపోదు. కేసులు సమస్యాత్మకమైనవి. మార్చి చివరి వరకు గడవు పెంచాలి."