ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం ప్రకటనతో దక్షిణ తెలంగాణ వాసుల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నెలకొన్న సందేహాలు తొలగి, విశ్వాసం ఏర్పడిందన్నారు.
కేసీఆర్ ప్రకటనతో విశ్వాసం ఏర్పడింది: చాడ వెంకట్రెడ్డి - నదీ జలాలపై మాట్లాడిన చాడ వెంకటరెడ్డి
రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై సీఎం కేసీఆర్ ప్రకటనతో దక్షిణ తెలంగాణ వాసుల్లో సందేహాలు తొలగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ఘర్షణ పడకుండా, చర్చల ద్వారా నదీ జలాల అంశాన్ని పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు.
కేసీఆర్ ప్రకటనతో విశ్వాసం ఏర్పడింది: చాడ వెంకట్రెడ్డి
తెలుగు రాష్ట్రాలు ఘర్షణ పడకుండా, చర్చల ద్వారా నదీ జలాల అంశాన్ని పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు. ప్రాజెక్టుల వ్యవహారంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణలోకి తీసుకోవాలని చాడ కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.