విద్యుత్ వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి..
Dispute between Andhra Pradesh and Telangana: రాష్ట్రాల విద్యుత్ బకాయిల చెల్లింపు అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర విద్యుత్ మంత్రి సమాధానం ఇచ్చారు. విద్యుత్ వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదం కోర్టు పరిధిలో ఉందన్న కేంద్రం... బకాయిల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. తెలంగాణ రూ.6,111 కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోందని.. బకాయిలపై జోక్యం చేసుకోవాలని ఏపీ సీఎం లేఖ రాశారని తెలిపింది. విద్యుత్‌పై ఏపీ, తెలంగాణ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఉందని గుర్తు చేసింది. తెలంగాణ బకాయిపడిన సొమ్ములో అసలుపై వివాదం లేదని పేర్కొంది.అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే వివాదం నెలకొందని.. కేంద్రం బదులిచ్చింది.
Centre On AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా బదులుగానే ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలని ఏపీ సీఎం ఇటీవల కోరారని.. నీతిఆయోగ్‌తో భేటీలోనూ సీఎం ప్రస్తావించారని ఆయన వెల్లడించారు.
Centre On Special Package to AP: గతంలో ఏపీ ప్రభుత్వం కోరినందునే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత తమదేనని.. ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఏపీకి 2015-19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించామని తెలిపింది. ఏపీ ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రుణం సమకూర్చామని వివరించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ.22,112 కోట్లు ఇచ్చామని చెప్పింది. 2020-21లో ఏపీకి రూ.5,897 కోట్లు అందించినట్లు ప్రస్తావించింది. వీటితో పాటు ప్రత్యేక ప్యాకేజీ వివరాలు వెల్లడించింది.
ఇదీ చదవండి