నామినేషన్ విధానంలో పనులు అప్పగించడం అందరికీ సమాన అవకాశాలు అనే హక్కును తిరస్కరించడమే అవుతుందని కేంద్ర విజిలిన్స్ కమిషన్(CVC) స్పష్టం చేసింది. టెండర్ల ద్వారా పనులు అప్పగించడం సరైన విధానమని వివరించింది. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే నామినేషన్‌పై పనులు అప్పగించవచ్చంది. నామినేషన్ పనులకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాంటప్పుడే నామినేషన్‌పై పనులు..
నామినేషన్‌పై ఇచ్చిన పనులు, చేసిన కొనుగోళ్లు, కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ సంబంధిత శాఖలు, సంస్థలు, విభాగాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి పనుల వివరాలను నిర్దేశించిన వ్యవస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సంబంధిత శాఖల కార్యదర్శులకు అందజేయాలి. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు లేదా సమాన స్థాయి ఉన్న మేనేజింగ్ వ్యవస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. సంబంధిత సంస్థలకు చెందిన ఆడిట్ విభాగాలు నామినేషన్‌పై కేటాయించిన వాటిలో కనీసం పదిశాతం కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలి. నామినేషన్ అప్పగించడానికి గల కారణాల సైతం వైబ్‌సైట్లలో స్పష్టంగా వివరించాలని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు నామినేషన్‌పై పనులు అప్పగించవచ్చని తెలిపింది.