తెలంగాణలో పలు జాతీయ రహదారులకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా కేంద్ర మంత్రి వీకే సింగ్, సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్హెచ్163ని జాతికి అంకితం చేసిన నితిన్ గడ్కరీ - కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ నగర జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన వర్చువల్ విధానంలో హాజరయ్యారు.
ఎన్హెచ్163ని జాతికి అంకితం చేసిన నితిన్ గడ్కరీ
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ నగర జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు. 13వేల 169 కోట్లతో 766 కిలోమీటర్ల రహదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి.. మరో 8 నూతన రహదారులకు భూమిపూజ చేశారు.