central team visit in telangana : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి చేరుకొంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం జిల్లాల్లో పర్యటించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణాశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ ఉదయం కేంద్ర బృందాన్ని కలిసి పరిస్థితిని వివరించారు. నష్టాలకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో వరద నష్టాలపై కేంద్ర బృందం అధ్యయనం - flood effect in telangana
central team visit in telangana : వర్షాలు, వరద నష్టాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. తెలంగాణలో వర్షాలు-వరద ప్రభావం పరిస్థితుల గురించి విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ బృందానికి వివరించారు. ఇవాళ నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న ఈ టీమ్.. కడెం ప్రాజెక్టు, గోదావరి సృష్టించిన విలయంపై అధ్యయనం చేస్తోంది.

central team visit in telangana
అనంతరం కేంద్ర బృందం సభ్యులు జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఇవాళ నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో... రేపు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టంపై ఓ అంచనాకు వస్తారు. రేపు హైదరాబాద్‌లో సీఎస్ సహా ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.