తెలంగాణ

telangana

ETV Bharat / city

చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం - central team inspected telangana

జాతీయ ఉపాధి హమీ పథకం పనుల పరిశీలన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం... రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించింది. ఉపాది హామీ పనుల నిర్వహణపై ప్రశంసలు కురిపించింది. పల్లెప్రగతిలో భాగంగా చేపిస్తున్న పనులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయని కొనియాడింది.

చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం
చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం

By

Published : Dec 11, 2020, 10:33 PM IST

రాష్ట్రంలో ఉపాధి హమీ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని కేంద్ర బృందం కితాబిచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతోందని బృందం అభిప్రాయపడింది. జాతీయ ఉపాధి హమీ పథకం పనుల పరిశీలన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం... రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర బృందం... నర్సరీలు, డంపింగ్ యార్డులు, హరితహారం, పల్లెప్రకృతి వనాలు, రైతువేదికలు, కల్లాలు, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు తదితర పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని ప్రశంసించింది. ఈ పనులన్నీ చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయని కొనియాడింది.

చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం
చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం

పనులు బాగా చేస్తున్నందుకు మంత్రి, అధికారులను బృంద సభ్యులు అభినందించారు. వేగంగా, నిర్ణీత సమయానికి ముందే, 13 కోట్ల పనిదినాలను పూర్తి చేసిన ఘనత కూడా తెలంగాణకే దక్కుతుందని కేంద్ర బృందం తెలిపింది. 18 కోట్ల పనిదినాల వరకు చేసుకునే వీలుందని... అంతకు మించి చేసినా కూడా అవకాశం ఇస్తామని మంత్రి ఎర్రబెల్లికి కేంద్ర బృందం హామీ ఇచ్చింది. పెండింగ్ నిధుల అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇప్పటికే రూ.199 కోట్లు విడుదల చేశామన్న కేంద్ర బృందం... రెండు, మూడు రోజుల్లో మరో రూ.140 కోట్లు విడుదల చేస్తామని, మిగతా నిధులను కూడా త్వరలోనే ఇస్తామని తెలిపింది.

చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం

ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానించాలని తెలంగాణ సహా మరో ఎనిమిది రాష్ట్రాలు కోరుతున్నాయని... ఇందుకు మరికొంత సమయం పట్టవచ్చని వారు తెలిపారు. ఉపాధిహమీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని... సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారని ఎర్రబెల్లి తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయే పనులు చేపిస్తున్నారు: కేంద్ర బృందం

ఇదీ చూడండి:కొనసాగుతోన్న వరద సాయం.. ఒక్కరోజే రూ. 9.79 కోట్లు జమ

ABOUT THE AUTHOR

...view details