ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన మేరకు ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును 2021 జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శి కుల్దీప్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
CS Service Extension: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సర్వీసు 3 నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ప్రభుత్వ అభ్యర్థన మేరకు సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు
ఈ ఏడాది జూన్ 30 తేదీతో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండటంతో ఆయన సర్వీసును పొడిగించాల్సిందిగా.. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 16 (1) ప్రకారం మూడు నెలల పాటు సర్వీసు పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.
ఇదీ చదవండి:CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం