తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎన్ని నిరసనలు చేసినా.. సీఏఏ అమలు చేసి తీరుతాం' - citizenship amendment act news

సీఏఏ విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, మజ్లిస్, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. దేశంలో జరుగుతున్న హింస వెనుక కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయని ఆరోపించారు.

kishan reddy
kishan reddy

By

Published : Dec 30, 2019, 3:25 PM IST


సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకంగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని నిరసనలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా సీఏఏను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. స్వదేశీ శక్తులు, విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద భాజపా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

'ఎన్ని నిరసనలు చేసినా.. సీఏఏ అమలు చేసి తీరుతాం'

ABOUT THE AUTHOR

...view details