హైదరాబాద్‌లో జాతీయ చర్మ వ్యాధుల యునానీ పరిశోధన సంస్థను కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద ఎసో నాయక్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎర్రగడ్డలోని యూనానీ ఆసుపత్రిలో సంస్థను ప్రారంభించిన అనంతరం ఆ ప్రాంగణంలో ఔషద మొక్కలు నాటారు. రోగులకు ఆసుపత్రి చేస్తున్న సేవలు పరిశీలించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆయుష్ కేంద్రాల ఏర్పాటు కోసం కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో జాతీయ చర్మ వ్యాధుల పరిశోధన కేంద్రం - hyderabad latest news
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ యునానీ ఆసుపత్రిలో జాతీయ చర్మ వ్యాధుల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద ఎసో నాయక్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హైదరాబాద్‌లో జాతీయ చర్మ వ్యాధుల పరిశోధన కేంద్రం
సీఎం ఉదాసీనంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి
జాతీయ చర్మ వ్యాధుల పరిశోధన యూనానీ పరిశోధన కేంద్రం హైదరాబాద్‌లో నెలకొల్పడం సంతోషకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి డెడ్‌లైన్లు విధించడం సరికాదన్నారు. కార్మికుల పట్ల ఉదాసీనంగా వ్యవహారించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని స్పష్టం చేశారు. కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమస్యల పరిష్కరించడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.