Center on Paddy procurement: రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు. ధాన్యం సేకరణపై రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన గోయల్.. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెల్లడించారు. ఉప్పుడు బియ్యాన్ని ఇవ్వమని రాష్ట్రాలు రాసిచ్చాయని గుర్తుచేశారు. ముడి బియ్యాన్ని ఎంతైనా కొనుగోలు చేస్తామన్న కేంద్ర మంత్రి.. ఉప్పుడు బియ్యాన్ని మాత్రం ఒప్పందం మేరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
'ఒప్పందం మేరకే ఉప్పుడు బియ్యం కొంటాం..' పునరుద్ఘాటించిన కేంద్రమంత్రి.. - కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్
Center on Paddy procurement: ధాన్యం సేకరణ అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యాన్ని ఒప్పందం మేరకే కొంటామని మరోసారి స్పష్టం చేశారు.
"గతంలో ఎఫ్‌సీఐ అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంది. పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చాక నిర్దేశించుకున్న ధర మేరకు కొనుగోలు చేసి... రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద వాటిని ప్రజలకు పంపిణీ చేస్తుంటాయి. పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో.. అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి జరుగుతుంది. రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఇప్పటికే మాతో విస్తృతంగా చర్చలు జరిపారు. కొందరు ముఖ్యమంత్రులు అయితే బెదిరింపులకు సైతం దిగారు. అయినా మేము ఇప్పటికీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నాం. ఉప్పుడు బియ్యాన్ని ఒప్పందం మేరకు కొనుగోలు చేస్తాం. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నా." - పీయూష్ గోయల్, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి
ఇదీ చూడండి: