తెలంగాణ

telangana

ETV Bharat / city

'స్మారక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సహకరించండి' - తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి లేఖ

తెలంగాణ విమోచన పోరాటం గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకొని స్పూర్తి పొందాల్సిన అవసరం ఉందని... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు మ్యూజియం ఏర్పాటుకు భూమి కేటాయించి, వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

central minister kishan reddy to telanagana cm kcr
'స్మారక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సహకరించండి'

By

Published : Sep 13, 2020, 8:18 PM IST

విశిష్ట, సాహసోపేత చరిత్ర ఉన్న ‘తెలంగాణ విమోచన పోరాటం’ గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... లేఖ రాశారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్రతో కూడిన ప్రత్యేక స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షగా కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగానే... ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి ఈ అంశం గురించి ప్రస్తావించినపుడు, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్టు ఆయన వెల్లడించారు.

తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన అమరవీరుల చిత్రపటాలతో కూడిన మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించాల్సిందిగా లేఖలో కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా... తెలంగాణ ప్రాంతంలో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర తెలిసిన ప్రముఖ వ్యక్తిగా... ఈ స్మారక స్పూర్తి కేంద్రం ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని వెంటనే కేటాయించి, నిర్మాణానికి వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:యాదాద్రిలో కోతులకు అరటిపండ్లు అందించిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details