ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. దేశంలో 80 కోట్లమందికి ఉచిత ఆహారధాన్యాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.
Kishan Reddy : పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలి
రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరారు.
కిషన్ రెడ్డి, కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గతేడాది అర్హులందరికీ 5 కిలోల చొప్పుల ఉచిత బియ్యం అందజేశామని.. ఈ ఏడాది మే, జూన్లో ఉచిత ఆహారధాన్యాలు పేదలకు అందించాలన్నారు. ఆహారధాన్యాల పంపిణీలో జాప్యాన్ని వెంటనే అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ను కిషన్ రెడ్డి కోరారు.