దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటకానిది తొలి స్ధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy on tourism employment) అన్నారు. అలాంటి రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఫలితంగా పలు పన్నురాయితీలు లభిస్తాయన్నారు. ఇతర భారాలు తగ్గి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు, కొత్త ఆలోచనలు చేసేందుకు వీలవుతుందన్నారు. ఏపీలోని విశాఖలో ఒక రోజు పర్యటనకు(kishan reddy vishaka tour) వచ్చిన ఆయన.. మంత్రి అవంతితో కలిసి క్రూయిజ్ టూరిజం(Kishan reddy on Cruise Tourism)పై పోర్టు అధికారులతో సమీక్షించారు. దేశంలో 97 మేనేజ్మెంట్ సంస్థలు టూరిజంలో ఉన్నాయని... వీటన్నింటిని సమన్వయం చేసి ఒక టూరిజం విశ్వవిద్యాలయంగా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.
kishan reddy vishaka tour: 'పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం' - kishan reddy ap tour update
kishan reddy ap tour: పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీలోని విశాఖలో పర్యటించిన ఆయన.. బావికొండ వద్ద నిర్మిస్తున్న బుద్ధిస్టు కాంప్లెక్స్(Kishan reddy visited Buddhist Complex) పనులను పరిశీలించారు. దేశంలో ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటకానిది తొలి స్థానమని అన్నారు.
kishan reddy vishaka tour
పర్యాటకంపై ఆధారపడ్డ పలు దేశాలు కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని(corona impact on tourism) కిషన్ రెడ్డి అన్నారు. మన దేశంలో అలాంటి సమస్య లేదని తెలిపారు. పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో పద్థతిలో అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నామని వివరించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా ఉందన్నారు. విశాఖ పోర్టుతో మిగిలిన శాఖలను సమన్వయం చేసి వేగంగా పర్యాటక అంశాలను పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.