ప్రజల వల్లే కరోనా కట్టడి సాధ్యపడుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఎంవీఆర్‌డీఎల్ ల్యాబ్ సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న కిషన్ రెడ్డి.... భవిష్యత్తులోనూ అభివృద్ధికి సహకారం అందిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి
ప్రజల వల్లే కరోనా నియంత్రణ సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్, పడకల కొరత లేదని తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులు కొవిడ్ నియంత్రణకు మళ్లించుకునేలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణలో కరోనా వ్యాప్తి, తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కిషన్ రెడ్డి
దేశంలో కరోనా నియంత్రించేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని..... అవసరమైన పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నియంత్రణకు మళ్లించుకునేలా ఆదేశాలు జారి చేశామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి :కరోనా రెండో దశ తుపానులా విస్తరిస్తోంది: మోదీ
Last Updated : Apr 25, 2021, 3:44 PM IST