తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి - ఏపీ తాజా వార్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలను, ఆలయల నిర్మాణం, ధూపదీప నైవేద్యాలకు తితిదే సహకారం ఆందించాలని కిషన్ రెడ్డి కోరారు.

central-minister-kishan-reddy-visit-tirumala-temple
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

By

Published : Feb 20, 2021, 10:46 AM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తీర్థప్రసాదాలను అందజేశారు.

కరోనా తగ్గుముఖం పడుతోందని.. ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్​​ తీసుకోవాలని కిషన్‌ రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలను, ఆలయల నిర్మాణం, ధూపదీప నైవేద్యాలకు తితిదే సహకారం ఆందించాలన్నారు. శేషాచలంలోని ఎర్రచందనం కాపాడేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

ఇదీ చదవండి:ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీని సందర్శించిన ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details