హైదరాబాద్ తార్నాక డివిజన్ మనికేశ్వరినగర్లో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బాధితులను పరామర్శించి ఆదుకుంటామని పేర్కొన్నారు.
వరద నష్టం అంచనా వేయడానికి ఈరోజు కేంద్ర బృందం రాష్ట్రానికి చేరుకుందని తెలిపారు. ఎప్పుడు వరదలు ముంచెత్తినా ముందుగా వరద బాధితులకు రాష్ట్రం సహాయం చేయాలని కోరారు.