తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎర్ర చందనాన్ని జాతీయ సంపదగా గుర్తిస్తాం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి - చిత్తూరు జిల్లా న్యూస్ లేెటెస్ట్

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఎర్రచందనం మొక్కలను నాటారు. ఎర్రచందనం వృక్షాల పరిరక్షణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

ఎర్రచందనం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి: కిషన్​రెడ్డి
ఎర్రచందనం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి: కిషన్​రెడ్డి

By

Published : Nov 14, 2020, 1:15 PM IST

శేషాచలం అడవుల్లో అత్యంత విలువైన ఎర్రచందనం వృక్షాల పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఏపీలోని తిరుమలలో పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఆయన ఎర్రచందనం మొక్కలను నాటారు. గతంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఎర్రచందనం పరిరక్షణ కోరుతూ తాను ఉద్యమం చేశానని గుర్తు చేసుకున్నారు.

ఎర్రచందనం ప్రత్యేక కార్యదళాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్​కు లేఖ రాశానన్నారు. ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, భాజపా అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ముందు కెరీర్​.. తర్వాతే పెళ్లంటున్న అమ్మాయిలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details