తెలంగాణ

telangana

ETV Bharat / city

Kishan Reddy Injure: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తలకు స్వల్ప గాయం

విజయవాడలో జన ఆశీర్వాద యాత్ర ముగించుకుని వెళ్తుండగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి స్వల్ప గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు డోర్‌ తగిలింది.

కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి

By

Published : Aug 19, 2021, 5:09 PM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి విజయవాడలో స్వల్ప గాయమైంది. విజయవాడ రామవరప్పాడు సమీపంలోని వెన్యూ సమావేశ మందిరంలో జన ఆశీర్వాద యాత్ర బహిరంగసభ ముగించుకుని దుర్గగుడికి వెళ్లేందుకు పయనమైన సమయంలో కిషన్ రెడ్డి తలకు గాయమైంది. కారు ఎక్కే సమయంలో డోర్‌ తలకు బలంగా తగిలింది. నుదురు భాగంలో గాయం కారణంగా కమిలిపోయింది. ప్రథమ చికిత్స అనంతరం కిషన్‌రెడ్డి తన పర్యటనను కొనసాగించారు.

దుర్గమ్మ సేవలో కిషన్​రెడ్డి..

విజయవాడ దుర్గమ్మను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details