తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం: కిషన్ రెడ్డి - జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020

తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీతాఫల్​మండి, బౌద్ధనగర్​ డివిజన్​లలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

central minister kishan reddy comments on trs snd majlis
తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం: కిషన్ రెడ్డి

By

Published : Nov 26, 2020, 10:53 PM IST

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతున్నందున... భాజపా గెలవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్​ సీతాఫల్​మండి, బౌద్ధనగర్​ డివిజన్​లలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరాడి సాధించుకున్న తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్యానించారు. రెండు పడకగదుల ఇళ్లు, వరద బాధితులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details