రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
సాధారణ కార్యకర్తలకూ భాజపాలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. బండి సంజయ్‌కుమార్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. భాజపాలో సభ్యులమైనందుకు మనం గర్వపడాలని కార్యకర్తలను ఉద్దేశించి కిషన్‌రెడ్డి అన్నారు.
కుటుంబాలకు ఊడిగం చేసే పార్టీలు దేశంలో ఉన్నాయని.. భాజపా మాత్రం భారతమాతకు మాత్రమే ఊడిగం చేస్తుందన్నారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ భవిష్యత్ ఉందన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన, వంశపారంపర్య పాలన పోవాలని ఆక్షాంక్షిస్తున్నట్లు తెలిపారు. భారతమాత వైభవం, సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ భాజపా అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది: కిషన్‌రెడ్డి ఇవీచూడండి:రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు నష్టపోతున్నారు: కేంద్ర మంత్రి