తెలంగాణ

telangana

ETV Bharat / city

'భాజపాలో చేరాక నేను నేర్చుకున్న మొదటి నినాదం అదే'

భాజపాలో చేరాక తాను తెలుసుకున్న మొదటి నినాదం భారత్​ మాతాకీ జై అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. దిల్లీలో తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

central minister kishan reddy about his experience in bjp
'భాజపాలో చేరాక నేను నేర్చుకున్న మొదటి నినాదం అదే'

By

Published : Feb 2, 2020, 11:10 AM IST

కశ్మీర్​ హిందుస్థాన్​కా... నహీ కిసీకీ బాప్​కా అని తనకు నేర్పిన భాజపా హయాంలో కశ్మీర్​ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

భాజపాలో చేరాక తాను మొదట నేర్చుకున్న నినాదం భారత్​ మాతాకీ జై అని, రెండో నినాదం భారతీయ జనతా పార్టీకి జై అని తెలిపారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్​లో మగ్గుతున్న తెలుగు వారికి భారత పౌరసత్వం ఇవ్వాలనుకున్న మోదీ సర్కార్​ నిర్ణయంపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతాం చేస్తున్నాయని మండిపడ్డారు.

దిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరాలంటే, రాజధాని వాసులు కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

'భాజపాలో చేరాక నేను నేర్చుకున్న మొదటి నినాదం అదే'

ABOUT THE AUTHOR

...view details