ప్రపంచంలోకెల్లా రెండో దశ కరోనా కేసులు భారత్లోనే ఎక్కువగా నమోదు కావడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోడియం హైపోక్లోరైడ్ వాహనాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తూ.. ప్రాణవాయువు కొరతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
'ఎన్నికల వల్లే ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందిందనడం వాస్తవం కాదు' - corona deaths in telangana
రెండో దశ కరోనా కేసులు, మరణాలు ప్రపంచంలోకెల్లా భారత్లో భారీగా నమోదవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తూ.. ప్రాణవాయువు కొరతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి, తెలంగాణలో కరోనా వ్యాప్తి
స్వతహాగా అన్ని రాష్ట్రాలకు లాక్డౌన్ విధించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించిందన్న కిషన్ రెడ్డి.. ఎన్నికల వల్లే ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందిందనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ దేశంలో రెండో దశ కరోనా ప్రారంభం కాలేదని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. అందరు విధిగా మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.