తెలంగాణ

telangana

ETV Bharat / city

"కృష్ణా-గోదావరి అనుసంధానంతో 9.38లక్షల హెక్టార్లకు లబ్ధి" - కృష్ణా-గోదావరి అనుసంధానంతో 9.38లక్షల హెకార్టర్లకు లబ్ధి

కృష్ణా -గోదావరి నదుల అనసంధానం వల్ల 9.38 లక్షల హెక్టార్లకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపింది.

central minister given clarification on krishna and godavari linkage in parliment
"కృష్ణా-గోదావరి అనుసంధానంతో 9.38లక్షల హెకార్టర్లకు లబ్ధి"

By

Published : Dec 13, 2019, 9:29 AM IST

Updated : Dec 13, 2019, 10:17 AM IST

కృష్ణా- గోదావరి నదుల అనుసంధానం వల్ల 9.38 లక్షల హెక్టార్లకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో 1.84 లక్షల హెక్టార్లకు లబ్ధి చేకూరుతుందని జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా లోక్​సభకు వివరించారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి... కృష్ణా - గోదావరి నదులు అనుసంధానంలో తెలంగాణకు లబ్ధి చేకూరడానికి రెండు లింక్‌లు ప్రతిపాదించినట్లు వివరించారు.

ఇచ్ఛంపల్లి - పులిచింతల, ఇచ్ఛంపల్లి - నాగార్జునసాగర్​లకు లింక్‌ ప్రతిపాదనలపై జాతీయ జల అభివృద్ధి సంస్థ పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం.. ఇంద్రావతి సబ్‌ బేసిన్‌ నీటిని కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్‌లకు మళ్ళించే విషయంపైనా అధ్యయనం జరిగినట్లు కటారియా తెలిపారు. గోదావరి - కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్‌ను సిద్ధం చేసి.. ఈ ఏడాది మార్చిలో సంబంధింత రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపినున్నట్లు మంత్రి వివరించారు.


ఇవీచూడండి: "గోదావరి - కృష్ణా అనుసంధానంతో అద్భుతాలు"

Last Updated : Dec 13, 2019, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details