Athavale comments on AP capital: మూడు రాజధానుల అంశంపై కేంద్రమంత్రి రాందాస్ అఠావలే కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని.. మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావడం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజన సమయంలోనే రాజధానికి నిధులు ఇవ్వాల్సిందని అఠావలే అభిప్రాయపడ్డారు. రాజధాని నిధులపై గతంలో యూపీఏ సర్కారు విస్మరించిందని.. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి పనులు ఆగిపోయాయన్న అఠావలే.. రాజధానికి నిధులు ఇచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.