సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కృషి వల్లనే కేంద్ర ప్రభుత్వం బోనస్లు ప్రకటించిందని రైల్వే యూనియన్ నాయకుడు భరణి అన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలతో కలిసి.. మర్రి రాఘవయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'రైల్వేశాఖను ప్రైవేటీకరిస్తే ఊరుకోం' - ప్రేవేటీకరణ దిశగా భారతీయ రైల్వే
రైల్వే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రైల్వే యూనియన్ నాయకుడు భరణి ఆరోపించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కృషి వల్లనే బోనస్లు ప్రకటించిందంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'రైల్వేశాఖను ప్రైవేటీకరిస్తే ఊరుకోం'
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా కేంద్ర ప్రభుత్వం బోనస్లు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించినా.. రాఘవయ్య కృషితో కేంద్ర ప్రభుత్వం బోనస్లు ప్రకటించినట్లు తెలిపారు. రైల్వే ప్రైవేటీకరణ దిశగా.. కేంద్రం పావులు కదుపుతోందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి:భారత సంస్థ 'జీహెచ్ఈ'కి ప్రతిష్ఠాత్మక యూఎన్ అవార్డ్