తెలంగాణ

telangana

ETV Bharat / city

'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి' - ఈటవీ భారత్​తో కిషన్​ రెడ్డి ముఖాముఖి

కరోనా నివారణ, లాక్​డౌన్​ కొనసాగింపునకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. నోడల్ ఏజెన్సీగా ఉన్న హోం మంత్రిత్వ శాఖ అందుకోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది... వైరస్ వ్యాప్తి ఉద్ధృతిని నిలువరించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారనే విషయాలపై కిషన్​ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..

central home union minister kishan reddy interview with etv bharat
'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

By

Published : Apr 12, 2020, 1:12 PM IST

Updated : Apr 12, 2020, 3:42 PM IST

'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

ప్ర: కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలేంటి?

జ: కరోనా తగ్గుముఖం పడుతోంది, వైరస్ వ్యాప్తి నివారించుకోవచ్చు అనే సమయంలో మర్కజ్​ కేసులు రావడం వల్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో 90 శాతం కేసులు తబ్లీగీ జమాతేకు సంబంధించినవే. అన్ని రాష్ట్రాలు కూడా ఐకమత్యంతో పనిచేస్తున్నాయి. లాక్​డౌన్ పొడిగింపు విషయం ఈ రోజు కానీ, రేపు కానీ ప్రధాని ప్రకటించనున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన జిల్లాల్లో పటిష్ఠంగా అమలు చేసేలా రాష్ట్రాలకు ఆజమాయిషీ ఇచ్చి కేంద్రం పర్యవేక్షించనుంది.

ప్ర: వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు రాష్ట్రాల సహకారం ఎలా ఉంది?

జ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఒక్క పశ్చిమ బంగా ప్రభుత్వం మాత్రమే హెల్త్​ బులెటిన్​ విడుదల చేయకుండా, కొవిడ్​ మరణాలను సహజ మరణాల కింద చూపిస్తూ సమస్యను పక్కదారి పట్టించాలని చూస్తోంది.

ప్ర: లాక్​డౌన్​ పొడిగింపు విషయంలో ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొడిగించే, ముగిసే సమయానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది?

జ: ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకున్నాం. జాయింట్ సెక్రటరీస్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. లాక్​డౌన్​ ఎప్పుడు ఎత్తివేసినా తీసుకోవాల్సిన చర్యలపై ముసాయిదాను తయారు చేశారు. దానిపైనా శనివారం నాడు చర్చించాం. ఇంకా సమయం ఉన్నందున ఇంకా కొన్ని అంశాల్లో మార్పు చేర్పులు చేయనున్నాం.

ప్ర: ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, మినహాయింపుల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. వ్యవసాయ రంగం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?

జ: ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం. కేంద్రం ఎలాంటి షరతులు విధించలేదు. లాక్​డౌన్​ నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయిస్తూ మొదటి రోజే ఆదేశాలు జారీ చేశాం.

ప్ర: విదేశాలకు ఔషధాలు, మత్స్య సంపద ఎగుమతులకు సంబంధించి ఆదేశాలు ఇవ్వలేదని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. మీ సమాధానమేంటి?

జ: మెడిసిన్​ శ్రీలంక, అమెరికా విమానాల్లో పంపించాం. అక్కడికి చేరుకున్నాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ధన్యవాదాలు కూడా తెలిపారు. విదేశాలకు పంపించే మెడిసిన్​ రాత్రింబవళ్లు తయారు చేసి పంపిస్తున్నాం.

ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం!

Last Updated : Apr 12, 2020, 3:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details