తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఈ నెల 17న ఉదయం 11గంటలకు కమిటీ తొలి భేటీ వర్చువల్‌గా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోంశాఖ.. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది.
సమావేశంలో చర్చలు జరిగే ప్రధాన అంశాలు..
1. ఏపీ ఫైనాన్స్ కొర్పొరేషన్ విభజన
2. విద్యుత్ వినియోగ అంశాలు