తెలంగాణకు గడిచిన ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1,63,700 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
- ఇదీ చదవండి :మాల్దీవుల్లో భారత్‌పై విషప్రచారం
2014-15 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల మధ్య పన్ను వాటా కింద రూ.99,076.21 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.64,624.78 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద తెలంగాణకు రెండేళ్లలో 10,72,280 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు బండి సంజయ్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి రామేశ్వర్ తేలి సమాధానంగా చెప్పారు. 2018-19లో 9,23,800, 2019-20లో 1,48,480 కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు.
- ఇదీ చదవండి :దిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రైతుల ఆందోళన