Nuclear Power Plant News: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం... సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 12వందల 8 మెగావాట్ల సామర్యంతో 6 రియాక్టర్లతో అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. భాజపా సభ్యుడు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు.. కేంద్రం ఆమోదం! - శ్రీకాకుళం తాజా సమాచారం
Nuclear Power Plant News: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు.. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ మేరకు భాజపా ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
శ్రీకాకుళం
పరిపాలన, ఆర్ధిక అనుమతుల తర్వాత దీని వ్యయం, పెట్టుబడుల వివరాలు తెలుస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. అణు విద్యుత్తు కేంద్రం ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యురేనియం నిల్వలపైనా సమాధానం చెప్పిన మంత్రి...మొత్తం 11 రాష్ట్రాల్లో 3 లక్షల 69వేల 42 టన్నుల యురేనియం ఉన్నట్లు అంచనా వేస్తే...58 శాతంనిల్వలు ఏపీలోనే ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:నేటి నుంచి అమల్లోకి ఓఆర్‌ఆర్‌పై టోల్ ఛార్జీల పెంపు