ఇంటింటికి నీటి సరఫరా విషయంలో రాష్ట్రానికి కేంద్రం ప్రశంసలు - తెలంగాణను ప్రశంసించిన కేంద్ర మంత్రి షెకావత్
20:45 March 16
ఇంటింటికి నీటి సరఫరా విషయంలో రాష్ట్రానికి కేంద్రం ప్రశంసలు
ఇంటింటికి నీటి సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్ పార్లమెంటులో అభినందించారు. తెలంగాణలో 'ఇంటింటికి నల్లా నీరు' పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు షెకావత్ చెప్పారు.
తెలంగాణ, గోవా రాష్ట్రాలు.. గ్రామాల్లో వందశాతం ఇళ్లకు తాగునీరు ఇస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, గోవాలో మంచినీటి కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.