తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం కింద రూ.245.96 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ సహా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొన్న ఐదు రాష్ట్రాలకు జాతీయ ప్రకృతి వైపరీత్య స్పందన నిధి కింద రూ.1,751.05 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం తెలిపింది.
తెలంగాణకు రూ.245 కోట్ల వరద సాయం
ఇటీవల వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు కేంద్రం చేయూతనందించింది. అదనపు సాయం కింద రూ.245 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణకు రూ.245 కోట్ల వరద సాయం
ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.671.14 కోట్లు, అసోంకు రూ.437.15 కోట్లు, ఒడిశాకు రూ.320.94 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.75.86 కోట్లు ప్రకటించింది.