పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. 2005-06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో డీపీఆర్ ఆమోదించారని స్పష్టం చేసింది. 2009 జనవరి 20 తర్వాత తమ వద్ద డీపీఆర్ పెండింగ్‌లో లేదని వెల్లడించింది. 2009 జనవరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన డీపీఆర్ రాలేదని జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
POLAVARAM: 'పోలవరం రివైజ్డ్ డీపీఆర్ పెండింగ్ లేదు' - polavaram dpr updates
పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2009 జనవరి 20 లోపు వచ్చిన ఏ డీపీఆర్ కూడా పెండింగ్‌లో లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
![POLAVARAM: 'పోలవరం రివైజ్డ్ డీపీఆర్ పెండింగ్ లేదు' center on polavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12649729-170-12649729-1627903347299.jpg)
center on polavaram
2005-06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో డీపీఆర్ ఆమోదించారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ 2011, 2019లో ఆమోదించిందన్నారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు.. జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం చెప్పారు.
ఇదీచూడండి:CM KCR Speech: 'సాగర్‌కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'