తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రానిదే : కేంద్రం - amaravathi latest news

ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్రం స్పందించింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

amaravathi news
amaravathi news

By

Published : Feb 4, 2020, 6:25 PM IST

రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్​సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన హోంశాఖ.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని స్పష్టం చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం 2015లో అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నోటిఫై చేశారని కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.

రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రానిదే : కేంద్రం

ఇదీ చూడండి:'కేటీఆర్​ కాళ్లు పట్టుకుంటే.. మీకే సిగ్గుచేటు'

ABOUT THE AUTHOR

...view details