Centre On AP Medical Colleges: ఏపీలో మూడు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రంలోని పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ‘‘ఏపీలో ఇప్పటికే 13 వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కళాశాలలు అభివృద్ధి చేస్తాం. తిరుపతి శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, అనంతపురం వైద్య కళాశాలలు అభివృద్ధి చేస్తాం’’ అని కేంద్రం పేర్కొంది.
కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయండి..