ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకునేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana chief minister KCR) వినతి మేరకు ఈ ఒక్కసారి మాత్రమే అదనంగా తీసుకుంటామని స్పష్టం చేసింది.
గడిచిన యాసంగిలో రాష్ట్రం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని(uppudu biyyam Purchase Issue) కొనుగోలు చేసింది. వాటి నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) వస్తాయి. సీజను ఆరంభానికి ముందుగానే 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) రూపంలో మిగిలిన వాటిని సాధారణ బియ్యంగా ఇవ్వాలని కేంద్రం కోరింది. కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) తీసుకోవాలని రాష్ట్రం పదేపదే విన్నవించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లి రెండు దఫాలు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్(Central minister piyush goyal)ను కలిసి పరిస్థితి వివరించారు.