సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ కొనసాగింపు చెల్లదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది. శ్రీధర్‌ను సీఎండీగా కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ కొత్తగూడేనికి చెందిన జీకే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. శ్రీధర్ 2018 జనవరి 1 నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనగాతున్నారని.. ఆయన నియామకాన్ని రద్దు చేసి ఆయన వేతనాన్ని రికవరీ చేయాలని పిటిషనర్ కోరారు.
సింగరేణి సీఎండి కొనసాగింపు చెల్లదు: కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ - సింగరేణి సీఎండీ శ్రీధర్ కొనసాగింపుపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టత
సింగరేణి సీఎండీగా శ్రీధర్ కొనసాగింపు చెల్లదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం అవసరం ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించలేదని వివరించింది.
సింగరేణి సీఎండి కొనసాగింపు చెల్లదు: కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ
కేసులో ప్రతివాదిగా ఉన్న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం సీఎండీ నియామకానికి, కొనసాగింపునకు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని తెలిపింది. శ్రీధర్ కొనసాగింపుపై ఏకాభిప్రాయం లేదని... రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించలేదని వివరించింది.
ఇదీ చూడండి:సెటిల్మెంట్ చేసినా కేసు నుంచి తప్పించుకోలేరు: సుప్రీం
TAGGED:
singareni cmd sridhar issue