అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాలు చేసిన ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలపై కేంద్రం అధికారులు ఆరా తీశారు.
సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష - రాష్ట్రాల్లో పరిస్థితులపై రాజీవ్ గౌబ ఆరా
అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు.
![సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష video conference](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6551443-138-6551443-1585223681639.jpg)
రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేబినెట్ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రజల అవసరాలకు సరిపడా సరకులు అందుబాటులో ఉంచినట్లు కేంద్రానికి నివేదించారు తెలంగాణ అధికారులు.