కేంద్ర బృందం పర్యటన అనంతరం రాష్ట్రంలో కరోనా పరీక్షల సదుపాయాలను పెంచామని, కంటైన్మెంట్ జోన్లలో పర్యవేక్షణ, నియంత్రణా చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా దృశ్యమాధ్యమమ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా పరీక్షల సదుపాయాలను పెంచాం: సీఎస్ - central cabinet Secretary video conferenc
కరోనా నియంత్రణ, కంటైన్మెంట్ జోన్లలో పర్యవేక్షణతో పాటు తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా దృశ్యమాధ్యమమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సదుపాయాలను పెంచామని సీఎస్ సోమేశ్‌కుమార్ వివరించారు.
రాష్ట్రంలో కరోనా పరీక్షల సదుపాయాలను పెంచాం: సీఎస్
కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు, పరీక్షల సామర్థ్యం పెంపు, ట్రేసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఇతర చర్యలపై రాజీవ్ గౌబా సమీక్షించారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. మరణాలు వీలైనంత తక్కువగా ఉండేలా పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్న కేబినెట్ కార్యదర్శి.. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల లభ్యత, చికిత్సా నిర్వహణ, సదుపాయాల సంబంధిత అంశాలపై అధికారులులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని కోరారు.