ఏపీలోని తూర్పగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ఎమ్మెల్యేలతో తనకు ముప్పు ఉందని, ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో లోక్సభ్ స్పీకర్‌కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలని ఎంపీ కోరారు. రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి మేరకు అన్ని అంశాలను పరిశీలించిన హోంశాఖ, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి, సీఆర్పీఎఫ్ డీజీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత - రఘురామ కృష్ణమరాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ.. నిత్యం వార్తలకెక్కుతున్న నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయన విజ్ఞప్తి మేరకు సీఆర్‌పీఎఫ్ బలగాలతో ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత