విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగేసింది. స్టీల్ ప్లాంట్, అనుబంధ సంస్థలన్నీ వందశాతం విక్రయిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీంతో ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ గనులను సైతం అమ్మేస్తున్నట్లు వెల్లడించింది.
VIZAG STEEL PLANT: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా మరో అడుగేసిన కేంద్రం
విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయం అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ సహా అనుబంధ సంస్థలన్నింటినీ వంద శాతం అమ్ముతామని స్పష్టం చేసింది.
VIZAG STEEL PLANT
ఈ మేరకు కన్సల్టెంట్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. బిడ్ దాఖలు చేసేందుకు ఈనెల 28 చివరి తేదీగా ప్రకటించింది. 29న సాంకేతిక బిడ్ తెరుస్తారని పేర్కొంది.
ఇదీచూడండి:Union Cabinet: మోదీ ప్రభుత్వంలో మంత్రులు- వారి శాఖలు