Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే..? - Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే..?
11:42 February 08
Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే..?
సొంతిళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి అంతకంతకూ పెరుగుతోన్న నిర్మాణ వ్యయాలు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తా ధర బ్రాండ్‌ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడం వల్ల ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి.
Cement Price Hike: సిమెంట్ ధరలకు రెక్కలు- ఇకపై బస్తా రూ.400!