తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాజల్ అగర్వాల్​ దంపతులు - TTD news

KAJAL VISITED TIRUMALA: తిరుమల శ్రీవారిని నటి కాజల్ అగర్వాల్​ దంపతులు సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖలు..
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖలు..

By

Published : Sep 26, 2022, 1:39 PM IST

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖలు..

KAJAL VISITED TIRUMALA: తిరుమల శ్రీవారిని నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తన భర్తతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కాజల్​ తెలిపారు.

YELLA VENKATESWARA RAO: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో శాస్త్రీయ సంగీత విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవిలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details