తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎవరి ఇళ్లల్లో వారే వినాయక చవితి, మొహర్రం జరుపుకోవాలి' - వినాయక చవితి వార్తలు

కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి, మొహర్రం జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అందరూ సహకరించాలని సూచించారు. ఎవరి ఇళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకుందామన్నారు. సామూహికంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటి పైనా నియంత్రణ కొనసాగుతోందని... మార్చి 16 నుంచి అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను దేవాలయాల్లో కాకుండా ఎవరిళ్లలో వారే నిర్వహించుకుంటున్నారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

indrakaran reddy
indrakaran reddy

By

Published : Aug 20, 2020, 10:11 AM IST

Updated : Aug 20, 2020, 10:16 AM IST

కరోనా నేపథ్యంలో వినాయకచవితి, మోహర్రం పండుగలను నిబంధనలకు లోబడి ఇళ్లలోనే జరుపుకోవాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టేందుకు భౌతికదూరాన్ని పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో ప్రజలు ఒకేచోట గుమిగూడే అవకాశమున్న కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో కూడా జనం ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉన్న సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, బార్లు, పబ్బులు, క్లబ్బుల లాంటి వాటిని మూసివేసినట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, క్రీడా మైదానాలు, పార్కులను కూడా తెరవడం లేదని... ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడడమే అతి ముఖ్యమని మంత్రి అన్నారు.

అన్ని అలాగే జరిగాయి

సామూహికంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటి పైనా నియంత్రణ కొనసాగుతోందని... మార్చి 16 నుంచి అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను దేవాలయాల్లో కాకుండా ఎవరిళ్లలో వారే నిర్వహించుకుంటున్నారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్, జగ్నే కీ రాత్, బోనాలు, బక్రీద్ తదితర పండుగలు సామూహికంగా కాక ఎవరిళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారని... ప్రభుత్వ పరంగా జరిపే స్వాతంత్ర్య దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా చాలా నిరాడంబరంగా, చాలా తక్కువ మందితోనే జరిగిందని అన్నారు. అదే తరహాలో వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రంను కూడా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి ఏర్పాట్లు ఉండవు

అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకొని, కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరించినట్లే వినాయక చవితి, మొహర్రం విషయంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు. ఎవరిళ్లలో వారే వినాయకుడికి పూజలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనల కారణంగా సామూహికంగా వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం నిర్వహించడం, ఊరేగింపులు జరపడం, నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం కుదరదని అన్నారు. ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని, ఎవరిళ్లలో వారు ఉత్సవాలు, పండుగలు, మతసంబంధ కార్యక్రమాలు నిర్వహించుకొని సహకరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.

Last Updated : Aug 20, 2020, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details