తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నికకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: సీఈసీ - తిరుపతి ఉపఎన్నికకు వాలంటీర్లు దూరంగా ఉండాలి న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి ప్రచారంలో రాళ్ల దాడి ఘటన ఫిర్యాదుపై సీఈసీ స్పందించింది. తెదేపా ఎంపీల ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ జవాబిచ్చారు.

cec on tirupathi
తిరుపతి ఉపఎన్నికకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: సీఈసీ

By

Published : Apr 16, 2021, 3:32 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నిక విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్లు పోటీలో ఉన్న ఏ అభ్యర్థిగా పోలింగ్ ఏజెంట్​గా ఉండరాదని స్పష్టం చేసింది. సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక శాతం కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుందని స్పష్టం చేస్తూ.. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్​కు లేఖ ద్వారా సమాధానం పంపింది. తెదేపా అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనకు సంబంధించి పార్టీ ఎంపీల బృందం ఇచ్చిన ఫిర్యాదుపై.. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ ఈ మేరకు 12 అంశాలకు బదులిస్తూ ప్రత్యుత్తరం పంపారు.

"రాళ్ల దాడికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు సాగుతోంది. ఏపీలోని తిరుపతి పార్లమెంట్ పరిధిలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ పరిశీలకునిగా నియమించాం. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్) లేదా రాష్ట్ర పోలీసు బలగాల భద్రత ఉంటుంది. సున్నితమైన, సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాల్లో అత్యధిక శాతం కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుంది. మొత్తం, 2470 పోలింగ్ కేంద్రాల్లో 1241 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. 315 వీడియోగ్రాఫర్లు మరియు 816 మైక్రో అబ్జర్వర్లను నియమించాం. తిరుపతి ఉపఎన్నిక విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలిచ్చాం. పోలింగ్ ఏజెంట్లగాను వాళ్లు పనిచేయటానికి వీళ్లేదు. మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పోలింగ్ సమయానికి 72 గంటల ముందు నుంచి ఓటరు కాని వారిని స్థానికంగా ఉండనివ్వం. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించటంతో పాటు ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాల తనిఖీల్లో సీఏపీఎఫ్ బలగాలు పాల్గొంటాయి" అని లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి తెలిపారు.

ఇదీ చదవండి:సొంతఖర్చులతో గ్రామ ప్రజలందరికీ టీకా వేయించిన సర్పంచ్‌

ABOUT THE AUTHOR

...view details