తెలంగాణ

telangana

ETV Bharat / city

సీబీఐ విచారణ.. దిల్లీకి వివేకా మాజీ డ్రైవర్‌ - cbi investigation in viveka murder case

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో భాగంగా వివేకా మాజీ కారు డ్రైవరును సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

viveka murder case
వివేకా హత్య కేసు

By

Published : Apr 16, 2021, 7:23 PM IST

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తోంది. మూడ్రోజుల కిందట దస్తగిరిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. అతడిని దిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అటు.. పులివెందులలో దస్తగిరి తల్లిదండ్రులు హాజీవలి, మస్తానమ్మను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. హాజీవలిని సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా కదిరికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఓ దుకాణం నిర్వహిస్తున్నందున పరిశీలించేందుకు వెళ్లినట్లు తెలిసింది. కూలీపని చేసుకుని జీవనం సాగించే తమ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధిస్తున్నారని దస్తగిరి తల్లి కంటతడిపెట్టింది.

ABOUT THE AUTHOR

...view details