తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలోని ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ : డీజీపీ సవాంగ్

ఏపీలోని అన్ని దేవాలయాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ గౌతం సవాంగ్​ తెలిపారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని ఆ రాష్ట్ర డీజీపీ అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

ఏపీలోని  ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ : డీజీపీ సవాంగ్
ఏపీలోని ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ : డీజీపీ సవాంగ్

By

Published : Sep 14, 2020, 12:04 AM IST

ఏపీలోని ఆలయాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్​ ఆదేశించారు. గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆలయాలకు జియో ట్యాగింగ్...

ఆలయాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయటంతో పాటు... ఆలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలన్నారు. ప్రజలు సైతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్‌ ఏర్పాటు చేసి... స్థానిక పోలీసు అధికారులు పర్యవేక్షించాలన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇవీ చూడండి : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సర్వం

ABOUT THE AUTHOR

...view details